Srirama Navami

శ్రీరామనవమి
"పల్లవి": శ్రీరామనవమి శ్రీరామ పుణ్యనవమి
తామసములు కామితములు దీర్చే కోదండరాముని "2"
"చరణం": త్రేతాయుగమున వెలసే విష్ణువు
దశరధుని తనయునిగా విష్ణువు
మువ్వురు సోదరుల అగ్రజుడై వెలసే
మువ్వురు మాతల బిడ్డడై మురిసే! "శ్రీరామ"
"చరణం": బండరాళ్ళు సైతం నీటిపై తేలే
బండవంటి హృదయాలు నీరై మరి కరిగే "2"
బండలు తామే మరి రామాయని పలికే
దుండగుడు మారెనులే! అందని కవి ఆయనులే! "శ్రీరామ"
"చరణం": ఎల్లలోకదైవము మరి తానై నిలిచెనులే
వొల్లనిదేదైనను సేయకూడదనిలే! "2"
ఎల్లరకు మార్గదర్శి తాను గాక ఎవరులే!
శ్రీవల్లీనుత చరణా, హరిగాక ఎవరులే! "శ్రీరామ"



Credits
Writer(s): Bijibilla Rama Rao
Lyrics powered by www.musixmatch.com

Link