Vennanti Unduvadu

వెన్నంటి యుoడు వాడు
"పల్లవి": వెన్నంటి ఉండు వాడు, వెన్నెల రాయుడు
వెన్నవంటి మనసువాడు కోనేటిరాయుడు "2"
"చరణం": ఎన్నెన్నో పుణ్యఫలము, లెన్నెన్నో జన్మఫలము
అన్నియును తీరునులే, అంకెలేమి సరిరావులే!
అన్నియుగాలలోను ఆతడే దైవములే! నిజములే!
మనయోగభాగ్యములే! మనకందినాడులే! "వెన్నంటి"
"చరణం": యుగపురుషుడు ఆయెనులే! మొగమాటములేదులే!
మొగలిపొదన ముళ్ళైనను మరుమల్లెలాయనులే!
అనిరుద్ధునకు సాటి దైవమే యిలను లేదులే!
ఉద్ధరిణి నీరైనను మనలనుద్ధరించువాడులే! "వెన్నంటి"
"చరణం": స్థాణువు కైనను లలిత మార్దవ మిచ్చేను
చిరాయువు జేయును చిరకాలము నెలవుంచును
ఆయువు తానే మన చాయయును తానే
కాయము తోనే మనలను పరమపధము చేర్చును""వెన్నంటి"



Credits
Writer(s): Bijibilla Rama Rao
Lyrics powered by www.musixmatch.com

Link