Yagnamuneeve

యజ్ఞము నీవే
"పల్లవి": యజ్ఞము నీవే కర్తవు నీవే!
అజ్ఞానము తొలగించే ఆత్మవు నీవే! "2"
"చరణం": ఆజ్ఞవు నీవే ఆర్ధ్రత నీవే
విజ్ఞానము నీవే వివిరణ నీవే
సుజ్ఞానులకు సమభావన నీవే
జిజ్ఞాసులమై నిన్ను అనుసరింతుములే "యజ్ఞము"
"చరణం": అజ్ఞానులకు అంతర్యామివే
పరిజ్ఞానులకు పరమాత్మవు నీవే! "2"
పరజ్ఞానము నీవే పరంధామవు నీవే! నీ
ఆజ్ఞానుసారము అనుసరింతుములే! "యజ్ఞము"
"చరణం": భుక్తివి నీవే భోక్తవు నీవే
భక్తిమార్గమున గమ్యము నీవే "2"
ఆర్తితో మమ్ములను ఆదరింతువులే!
పరమాత్మా నీకే మానస హారతిలే! "యజ్ఞము"



Credits
Writer(s): Bijibilla Rama Rao
Lyrics powered by www.musixmatch.com

Link